ప్రతిపక్షం, జూన్ 18: తెలంగాణ ప్రభుత్వం కాగితరహిత పాలన దిశగా కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇకపై సమావేశాలను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులందరికీ ప్రత్యేక ట్యాబ్‌లను అందజేశారు.
ఇకపై మంత్రివర్గ సమావేశాలకు సంబంధించిన ఎజెండా, నోట్లు, ఇతర పత్రాలు అన్నీ ఈ-పుస్తక రూపంలోనే అందుబాటులో ఉండనున్నాయి. డిజిటల్ కేబినెట్ విధానంతో పారదర్శకత పెరగడంతో పాటు కాగితం వినియోగం తగ్గి పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. సమావేశంలో డిజిటల్ విధానాన్ని ప్రదర్శించి మంత్రులకు వివరించారు.

















