ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ ఎదుట చికోటి ప్రవీణ్ హాజరు

ప్రతిపక్షం, జూన్ 19: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ నేడు ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట హాజరుకానున్నారు. ఈ మేరకు దర్యాప్తు అధికారులు గురువారం ఆయనను సంప్రదించి ఉదయం 11 గంటలకు కార్యాలయానికి రావాలని సూచించినట్లు సమాచారం.

గతంలో తన ఫోన్ అక్రమంగా ట్యాప్ చేశారని ఆరోపిస్తూ చికోటి ప్రవీణ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ప్రత్యేక దళం ఉన్నతాధికారి తన ఫోన్‌ను చట్టవిరుద్ధంగా నిఘాలో పెట్టారని ఆయన ఆరోపించారు.

ఈ నేపథ్యంలో నేడు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసి, ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఈ విచారణ కీలకంగా మారనుంది.

Spread the love

Related News

Latest News