KPHB: రోడ్డు పక్కన మళ్లీ.. ముగ్గురి అరెస్ట్

ప్రతిపక్షం, జూన్ 19: కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యభిచార కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్, జేఎన్‌టీయూహెచ్ మెట్రో స్టేషన్‌తో పాటు ప్రధాన బస్‌స్టాప్‌ల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల సందర్భంగా వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి వెల్లడించారు.

ప్రజలకు ఇబ్బందులు కలిగించే అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు కూడా అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు.

Spread the love

Related News

Latest News