హైదరాబాద్ మెట్రో: వాస్తవానికి NOCని జారీ చేయాల్సింది ఎవరు?

ప్రతిపక్షం, జూన్ 19: హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణను ప్రైవేటు సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పటికీ, ఆర్థిక వ్యవహారాల్లో ఇంకా స్పష్టత రాలేదు. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన రూ.13,257 కోట్ల రుణాన్ని ఆర్థిక సంస్థ ఇప్పటివరకు విడుదల చేయకపోవడంతో తదుపరి ప్రక్రియపై అనిశ్చితి కొనసాగుతోంది.

రుణం మంజూరు కావాలంటే ముందుగా అనుమతి పత్రం అవసరమని అధికారులు చెబుతున్నారు. అయితే ఆ అనుమతి పత్రాన్ని ఏ శాఖ జారీ చేయాలనే అంశంపైనే ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ పరిధిలోకి వస్తుందా, లేక రైల్వే శాఖ అనుమతి అవసరమా అనే విషయంపై ఇంకా స్పష్టమైన నిర్ణయం వెలువడలేదని సమాచారం.

ఈ అంశం తేలిన తర్వాతే రుణ విడుదల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రుణం అందిన అనంతరం మాత్రమే మెట్రో విస్తరణ తదితర కీలక పనులు వేగం పుంజుకునే అవకాశముంది. ప్రస్తుతం అనుమతి పత్రం అంశమే ప్రాజెక్టు పురోగతికి ప్రధాన అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది.

Spread the love

Related News

Latest News