‘ప్రైవేట్‌’ దోపిడీ

•సంపాదనే ధ్యేయంగా ప్రైవేట్‌ విద్యాసంస్థల తీరు

•అడ్మిషన్‌ ఫీజు రూ.2000 నుంచి రూ.5,500ల వరకు

•స్కూళ్లలో పాఠ్య, నోట్‌ పుస్తకాలు, షూ, టై, బెల్టుల విక్రయం

•విద్యాశాఖ నిబంధనలు పాటించని యాజమాన్యాలు

ప్రతిపక్షం, జూన్ 20, వనపర్తి ప్రతినిధి: ధనార్జనే ధ్యేయంగా ప్రైవేట్‌ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. తమ స్కూల్‌లో మంచి ర్యాంకులు వస్తున్నాయని, నాణ్యమైన విద్య అందిస్తున్నామని, నమ్మించి నట్టేట ముంచుతున్నాయి.గత ఏడాది కంటే ఈ సారి ఫీజులు పెంచడంతో విద్యార్థుల పేరెంట్స్‌ ఆందోళనకు గురవుతున్నారు. ఎల్‌కేజీ పిల్లలకే పుస్తకాలకు రూ.6,500 నుంచి రూ.13000 వరకు వసూలు చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. పాఠశాలలపై నిఘా ఉంచాల్సిన విద్యాశాఖ అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

పుస్తకాల పేరుతో… దోపిడీ!

వనపర్తి పట్టణంలోని ప్రైవేట్ స్కూళ్లు తమ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులను నిలువునా దోపిడీ చేస్తున్నాయి. ఏ ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఆయా పాఠశాలలు నిర్ధేశించిన పుస్తకాలు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.ఆయా పాఠశాలలకు సంబంధించిన పుస్తకాలు కేవలం వారి కనుసన్నల్లో నడిచే వాటిలోనే మాత్రమే లభిస్తున్నాయి. ఆ పుస్తకాలు ఇతర ఏ బుక్ స్టాల్‌లో కూడా లభించని పరిస్థితి నెలకొంది. అంతేకాదు ఆయా బుక్ స్టాల్స్‌లో లభించే ఒక్కో పుస్తకం ఖరీదు వేలల్లో ఉంటుందంటే అతిశయోక్తి లేదు. కేవలం నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకే ఒక్కొక్కరికీ దాదాపు రూ.4,500 నుంచి రూ.5,500 వరకు పుస్తకాలకే వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక నర్సరీ విద్యార్థి చదివే పుస్తకానికి వేల రూపాయలు ఉంటాయా? కేవలం వందల రూపాయలు ఉండాల్సిన పుస్తకాల విలువను వేలకు పెంచి, సదరు బుక్ స్టాల్ యాజమాన్యాలతో పాఠశాలల యాజమాన్యాలు కుమ్మక్కై.. చేస్తున్న నిలువు దోపిడీకి ఇది నిదర్శనం.

అంతా విద్యాశాఖ అధికారుల కనుసన్నల్లోనే..?

ప్రైవేట్ పాఠశాలలు చేస్తున్న ఈ తరహా దోపిడీని విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ అధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందా.? లేక వారికి అందాల్సిన మామూళ్లు అందితేనే ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా.. ప్రైవేట్ పాఠశాలలు ఓ వైపు అధిక ఫీజులు వసూలు చేస్తూ.. మరోవైపు.. పుస్తకాల పేరుతో సరికొత్త తరహాలో దోపిడీకి పాల్పడుతుండటంతో.. విద్యార్థుల తల్లిదండ్రుల జేబులు గుల్ల అవుతున్నాయి. 2026-27 వార్షిక విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యింది .తమ పాఠశాల విద్యార్థులు ఇన్ని మార్కులు తెచ్చుకున్నారు.. అ న్ని మార్కులు తెచ్చుకున్నారంటూ విద్యార్థుల ఫొటోలు, మార్కులతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశా రు. పట్టణాలు, గ్రామాల్లో రంగురంగుల ఫొటో లతో పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు.మరి ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూళ్ల దోపిడీకి చెక్ పెట్టే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారా.? లేదా.? అన్నది చూడాలి.దీనిపై వనపర్తి ఎంఈఓ. మదిలేటి గారిని వివరణ కోరగా…ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు, నోట్ పుస్తకాలు, టై, షూ, బెల్ట్ లు విక్రాయించరాదు.. ఎవరైనా నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తప్పవు.

Spread the love

Related News

Latest News