CM Revanth Reddy Focus on Tourism: హైదరాాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కైవాక్ వే ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణలో బౌద్ధ పర్యాటక స్థలాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నాగార్జున సాగర్‌లోని బుద్ధవనంలో ఇంటర్నేషనల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని, బ్యాక్ వాటర్ వరకు బోటింగ్ పునరుద్ధరించాలన్నారు.
అలాగే, ఫణిగిరి, నేలకొండపల్లి టూరిజం సర్క్యూట్, గోల్కొండ చుట్టూ ఆక్రమణలు తొలగించి రోడ్డు అభివృద్ధి చేయాలన్నారు. దీంతోపాటు హైదరాబాద్-నాగార్జునసాగర్ మధ్య నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.