ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం జీవిత బీమా

ప్రతిపక్షం, జూన్ 24: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా ఒక్కొక్కరికి రూ.1.20 కోట్ల వరకు బీమా రక్షణ కల్పించే **‘ఎంప్లాయీస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్’**ను అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ పథకాన్ని సీఎం రేవంత్ ఈ నెల 25న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఉద్యోగి లేదా పెన్షనర్ సహజ మరణం గానీ, ప్రమాదవశాత్తు మరణం గానీ సంభవించిన సందర్భాల్లో ఈ బీమా ప్రయోజనం అందించనున్నారు.

పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకునే ప్రక్రియను ప్రారంభించింది. ఈ బీమా ద్వారా ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.

Spread the love

Related News

Latest News