ప్రతిపక్షం, జూన్ 24: తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీ–జీ రామ్ జీ పథకాన్ని జూలై 1 నుంచి అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. పథకం అమలుకు రాష్ట్రంలో అవసరమైన ఏర్పాట్లపై ఇప్పటికే అధికార యంత్రాంగం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఈ పథకం అమలుకు సుమారు రూ.5,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ కొత్త విధానాన్ని అమలు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం అందించే సుమారు రూ.2,500 కోట్ల వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అదనపు భారం మోయడం కష్టమవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర నిధులు కోల్పోకుండా పథకాన్ని అమలు చేయడానికే మొగ్గు చూపుతున్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.

















