ప్రతిపక్షం, జూన్ 24: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు గాంధీభవన్‌లో నేడు ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇందిరా భవన్‌లో జరిగే ఈ సమావేశంలో వివిధ సమస్యలపై ప్రజలతో నేరుగా మాట్లాడి పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు. ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.
ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వేగంగా పరిష్కరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు తెలిపాయి.

















