కలెక్టర్ కార్యాలయం లో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూన్ 24: మెదక్ జిల్లా కేంద్రంలోని మాత శిశు సంక్షేమ హాస్పిటల్ మరియు ఏరియా హాస్పిటల్ లో సౌకర్యాలు మెరుగుపరచాలని మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కే నర్సమ్మ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని . సిపిఐ(ఎం)మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయని . ఆసుపత్రి పేషెంట్‌కు అవసరమైన రక్త పరీక్షలలో ప్రాథమికమైనది, సిబిపి పరీక్ష అందుబాటులో లేదుని . ఈ పరీక్ష కోసం పేషెంట్లు ప్రైవేట్ ల్యాబ్ లకు వెళ్లగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. మిగతా టెస్టులు సైతం 24 గంటలు దాటితే గానీ రిపోర్టు రావడం లేదు. ఇన్ పేషెంట్ అయినా అవుట్ పేషెంట్ అయినా 24 గంటల సమయమే పడుతుంది. జిల్లా కేంద్ర ఆస్పత్రిలోనే ప్రజలకు రక్త పరీక్షలు అందుబాటులో లేకపోతే ప్రజల పరిస్థితి ఏమిటి ఆమె ప్రశ్నించారు.
ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం లేదు. కోతుల బెడదలతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి లోపలి భాగంలో మెట్లపైనే కూర్చుంటున్నాయి. అన్ని రకాల సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సౌకర్యాలు తక్షణమే మెరుగు పర్చాలని ఆమె డిమాండ్ చేశారు ముఖ్యంగా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో.సి బి పి సహా అన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉంచాలి. టెస్టు రిపోర్టు తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలని.ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. హాస్పిటల్ ఆవరణలో కోతుల బాధ నివారించాలి. హాస్పిటల్ అన్ని రకాల పోస్టులు భర్తీ చేయాలి. హాస్పిటల్ పైభాగం రిపేరు చేయించాలని ఆమె డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మల్లేశం సంతోష్ ఏ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


















