•ఇండ్ల ఎదుటకాలువలో నిలిచిన మురుగునీరు
ప్రతిపక్షం, జూన్ 26, వనపర్తి ప్రతినిధి: వనపర్తి జిల్లా కేంద్రంలోని 4వ వార్డు హైదరాబాద్ ప్రధాన మురుగు కాలువలు అస్తవ్యస్తంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.కాలువలు సకాలంలో శుభ్రం చేయపోవడం, ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోవడంతో మురుగునీటి దుర్వాసన వెదజల్లుతోంది.కాలనీలోని మురుగుకాలువ నుంచి నీరు బయటకి వెళ్లడానికి దారి లేక ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.రోజుల తరబడి మురికి నీరు కాలువలో ఉండడంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. దోమలు విపరీతంగా పెరిగి జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉందని కాలనీవాసు లు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కాలువలను శుభ్రం చేసి మురుగునీరు నిలిచి ఉండకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.దీనిపై వనపర్తి మున్సిపల్ కమిషనర్ కు సమాచారం ఇవ్వగా… శానిటరీ ఇన్స్పెక్టర్. ఉమా మహేశ్వర్ రెడ్డి సమస్య తెలుపండి అని పేర్కొన్నారు.
















