ప్రతిపక్షం, జూన్ 26: రాష్ట్ర ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రైతుబంధు సాయాన్ని పలుమార్లు అందించకుండా రైతులను నిరాశపరిచారని విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన వందలాది హామీలను అధికారంలోకి వచ్చిన 30 నెలలు గడిచినా అమలు చేయలేదని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
పరిగిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలోని 1.67 కోట్ల మంది మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.1.50 లక్షలు జమ చేస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
















