ప్రతి శుక్రవారం పారిశ్రామికవేత్తలతో సమావేశం.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన

ప్రతిపక్షం, జూన్ 26: హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించిన ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌పో-2026ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. పారిశ్రామిక వృద్ధి అంటే కేవలం పెట్టుబడులు కాదని, ప్రజల జీవనోపాధి అని అన్నారు. ప్రతి శుక్రవారం ఎంఎస్ఎంఈలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఏఐ, రోబోటిక్స్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాలకు తెలంగాణ ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి వెల్లడించారు.

Spread the love

Related News

Latest News