ప్రతిపక్షం, జూన్ 27: హైదరాబాద్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు (వీహెచ్) కిడ్నీ సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను ఖైరతాబాద్‌లోని ప్రత్యేక నెఫ్రాలజీ, యూరాలజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 78 ఏళ్ల వీహెచ్ గతంలో కూడా ఇదే సమస్యకు చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తుండగా, ఈ వార్తతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

















