హైదరాబాద్ చేరుకునేలోపే విషాదం.. విమానంలోనే బాలిక మృతి

ప్రతిపక్షం, జూన్ 27: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇథియోపియా నుంచి క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్న ఓ బాలిక ప్రయాణ మధ్యలో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే ఆమెను విమానాశ్రయంలోని అపోలో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో విషాద వాతావరణం నెలకొనగా, సంబంధిత అధికారులు అవసరమైన ప్రక్రియలు చేపట్టారు.

Spread the love

Related News

Latest News