ప్రతిపక్షం, జూన్ 27: ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీ ఆర్. కృష్ణయ్య ఈ నెల 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చారు. అదే రోజు జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలోని సుమారు 18 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని ఆయన ఆరోపించారు. విద్యార్థుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి బకాయిలను విడుదల చేయాలని, లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు.

















