ప్రతిపక్షం, జూన్ 27: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదనే విమర్శలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “గోడకు వేలాడదీసిన తుపాకీ నిశ్శబ్దంగానే ఉంటుంది.. కానీ పేలితే విస్ఫోటనమే” అంటూ కేసీఆర్ పాత్రను వివరించారు.
కేసీఆర్ అనేక మంది నాయకులను తీర్చిదిద్దారని, తామంతా ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలనే ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పారు. “మేం మాట్లాడేది కేసీఆర్ మాటలే. ఆయన దర్శకత్వంలోనే పని చేస్తున్నాం. నాయకుడు ప్రతిసారి ముందుండాల్సిన అవసరం లేదు. వెనక నుంచి మార్గనిర్దేశనం చేస్తూ ఆశీర్వదిస్తే చాలు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

















