ఓటర్ల జాబితా సవరణ రాజ్యాంగబద్ధ ప్రక్రియే: కిషన్‌రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 27: ప్రత్యేక విస్తృత ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పూర్తిగా స్వతంత్రంగా, రాజ్యాంగబద్ధంగా జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రక్రియ కొత్తది కాదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఎన్నికల సంఘం ఇలాంటి సవరణలు చేపట్టిందని గుర్తుచేశారు.

అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ నమోదులను తొలగించడం ద్వారా ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా రూపొందించడమే ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

ఎన్నికల సంఘం తన రాజ్యాంగబద్ధ అధికారాల మేరకు నిబంధనల ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, దీనిపై అనవసర అపోహలు సృష్టించవద్దని కిషన్‌రెడ్డి సూచించారు.

Spread the love

Related News

Latest News