బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఐక్యమై రాజకీయ శక్తిగా ఎదగాలి: శ్రీనివాస్ గౌడ్

ప్రతిపక్షం, జూన్ 29:
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ తొలి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాలన్నీ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం బీసీ జనగణన నిర్వహించకుండా, బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించి వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేసిందని ఆరోపించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు తమ హక్కులు సాధించుకోవాలంటే ఐక్యంగా నిలబడి కొత్త రాజకీయ శక్తిగా ఎదగాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం సమిష్టిగా ఉద్యమించాలని ఆయన సూచించారు.

Spread the love

Related News

Latest News