తెలంగాణలో మెడికల్ సీట్ల పెంపునకు కసరత్తు.. కేంద్రంతో కీలక చర్చలు

ప్రతిపక్షం, జూన్ 29: తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మెడికల్ సీట్ల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ విద్యా సంవత్సరంలో 465 పీజీ, 110 యూజీ మెడికల్ సీట్ల పెంపునకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు.

ఈ అంశంపై ఢిల్లీలో జరగనున్న రాష్ట్రాల ఆరోగ్య మంత్రుల సమావేశంలో మంత్రి దామోదర రాజనరసింహ కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో ప్రత్యేకంగా చర్చించనున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) నుంచి కొత్త పీజీ సీట్లకు ఆమోదం లభిస్తే, ఒక్కో పీజీ సీటుకు సగటున రూ.1.50 కోట్ల చొప్పున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించనుంది.

మెడికల్ సీట్ల పెంపుతో రాష్ట్రంలో వైద్య విద్యకు మరింత ప్రోత్సాహం లభించడంతో పాటు, వైద్యుల కొరత తగ్గి ఆరోగ్య సేవలు మరింత బలోపేతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Spread the love

Related News

Latest News