పీవీకి కాంగ్రెస్ తగిన గౌరవం ఇవ్వలేదన్న కవిత

ప్రతిపక్షం, జూన్ 29: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ తగిన గౌరవం ఇవ్వలేదని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ స్వాభిమానాన్ని ఢిల్లీలో చాటిన మహానేత పీవీకి దక్కాల్సిన గుర్తింపును కాంగ్రెస్ నిరాకరించిందని ఆరోపించారు.

ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన పీవీ మేధస్సును గౌరవించకపోవడం కాంగ్రెస్ కుసంస్కారానికి నిదర్శనమని అన్నారు. పీవీ అభిమానులుగా కాంగ్రెస్‌ను ఎన్నటికీ క్షమించబోమని పేర్కొన్న కవిత, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పీవీ ఆశయాలు, అడుగుజాడల్లోనే పాలన సాగిస్తామని స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News