పెబ్బేరు సమీపంలో ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ప్రమాదం

•ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడినట్లుసమాచారం

ప్రతిపక్షం, జూన్ 29 , వనపర్తి ప్రతినిధి: కర్నూలు నుంచి హైదరాబాద్‌కు ఎన్ ఎచ్ -44 హైవే పై వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలో బోల్తా పడిన ఘటన కలకలం రేపింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో సుమారు 30 మంది ప్రయాణికులు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం.క్షతగాత్రులను వెంటనే వనపర్తి జిల్లా “పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి” తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, తోటి ప్రయాణికులు సహాయక చర్యలు చేపట్టి బస్సులో చిక్కుకున్న వారిని ఒక్కొక్కరిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు.అయితే, ఇద్దరు వ్యక్తులు బస్సులో ఇరుక్కుపోవడంతో వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది, స్థానికులు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News