ప్రతిపక్షం, జూన్ 29: పాల వ్యాపారంలో కొందరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యాపారులతో కుమ్మక్కై లాభాలు పొందుతున్నారని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలు, వాణిజ్య సముదాయాలు ప్రభుత్వం గుర్తించిన సంస్థల నుంచే పాలు కొనుగోలు చేసేలా ప్రత్యేక జీవో జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
అదే సమయంలో తెలంగాణ భాషలోని ‘ఇడుపు కాయితం’ పదంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్‌ను ఆమె తీవ్రంగా ఖండించారు. తెలంగాణ యాస, భాషను అవమానించే ప్రయత్నాలను సహించబోమని, ప్రాంతీయ భాషా గౌరవాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కవిత పిలుపునిచ్చారు.

















