ప్రతిపక్షం, జూన్ 29: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనపై అసెంబ్లీలో బహిరంగ చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇరు పార్టీల ఎన్నికల మేనిఫెస్టోల అమలుపై ఎన్ని రోజులైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
నల్గొండలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం, బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావిస్తూ, భార్యాభర్తల వ్యక్తిగత సంభాషణలను కూడా వినిపించే స్థాయికి వెళ్లిన వారిని ప్రజలు ఎలా చూడాలో ఆలోచించాలని వ్యాఖ్యానించారు.

















