ఆరోగ్యానికి మించిన ఆస్తి మరోటి లేదు: పీసీసీ అధ్యక్షుడు మహేష్

ప్రతిపక్షం బ్యూరో, నిజామాబాద్, జూన్ 29: అన్ని రకాల ఆస్తులు ఐశ్వర్యం ఉన్న ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యాన్ని మించిన ఆస్తి మరోకటి లేదని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో పాత కలెక్టర్ మైదానంలో జరిగిన ఒలంపిక్ రన్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 50 ఏండ్లు పై బడిన వారు నిత్యం వ్యాయమం చేస్తూ తమ ఆరోగ్యం కాపాడుకొని దిశగా కృషి చేయాలని అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణానికి త్వరలోనే పనులు మొదలు పెడతామని అన్నారు. నిజామాబాద్ జిల్లా క్రీడలకు నిలయమని ఇక్కడి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలలో పాల్గొని దేశానికి వన్నె తెచ్చిన క్రీడాకారులు ఉన్నారని గుర్తు చేశారు. మినీ స్టేడియంకు 15 రోజుల్లో రూ.5 కోట్లు చెక్ రానుందన్నారు. ఇందులో ట్రాక్ కొరకు ఖేలో ఇండియా పథకం ద్వారా ప్రత్యేక నిధులు వస్తాయని జిల్లా ఎంపీ ఈ నిధులను సమకూర్చాలని అన్నారు.జిల్లా కేంద్రం కు సమీపం లో రాజారాం స్టేడియం ఉందని దానిని అభివృద్ధి చేస్తామని యువకులు అక్కడికి వెళ్ళి క్రీడల కసరత్తు చేయాలని సూచించారు. ఇక నుంచి నిజామాబాద్ నుంచి ఎవరైతే మేటి స్పోర్ట్స్ లో రాణిస్తరో వారికి ప్రోత్సాహకంగా నేరుగా రూ.లక్ష రూపాయలు ఇస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, మేయర్ ఉమారాణి, నుడా చైర్మన్ కేశ వేణు, కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News