ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయానికి వరాల జల్లు.

12 కాటేజీలు నిర్మాణానికి 7 కోట్ల నిధులు మంజూరు.

ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఆలయానికి మహర్దశ.

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూన్ 29: తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం ఈ ఆలయానికి దశాబ్దాల కల అయిన ఏడుపాయల అభివృద్ధిని గత పాలకుల నిర్లక్ష్యపు నీడ నుండి. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దూర దృష్టితో అబివృద్ధి వైపు నడిపిస్తున్నారు.భక్తులు కొంగుబంగారంగా కొలిచే అమ్మవారి ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది.అలాంటి అమ్మవారి ఆలయ పరిసరాల్లో కనీస సౌకర్యాలు లేక భక్తులు అనేక అవస్తలు ఎదుర్కొంటున్నారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆలయ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించి ఆలయ అభివృద్ధికి వరాల జల్లు కురిపించారు.ఇందులో భాగంగా ఆలయ ప్రాంతంలో కాటేజీల నిర్మాణం కోసం 7 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఆలయం పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు.ఈ విషయం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక కార్యదర్శి వాణి ప్రసాద్ స్వయంగా తెలిపినట్టు తెలిపారు.భవిష్యత్లో ఆలయ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని. ప్రజలు ఇప్పుడు అమ్మవారి కరుణతో అభివృద్ధి చూస్తున్నారని, అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే అని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తెలిపారు.ప్రజల మద్దతుతో మరెన్నో అబివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అమ్మ వారిని కోరుకుంటున్నట్టు ఎమ్మెల్యే అబిప్రాయపడ్డారు.

Spread the love

Related News

Latest News