Trending Now

HYD: భారీ వర్షం.. ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌లకు పోటెత్తిన వరద!

గత రెండు, మూడు రోజులుగా హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జంట జలాశయాలైన ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. మూసీ నదిలో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసారం బాగ్‌ వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తోంది. మరో రెండు రోజులు కూడా పరిస్థితులు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నంబర్‌ 040 21111111, డీఆర్‌ఎఫ్‌ నంబర్‌ 90001 13667.

Spread the love

Related News

Latest News