ప్రతిపక్షం, జూన్ 30: హైదరాబాద్లోని మలక్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో మైనర్ల సోషల్ మీడియా పరిచయం రెండు కుటుంబాలను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చింది. ఈ ఘటన పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎంత అవసరమో మరోసారి గుర్తు చేసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. మలక్పేట్కు చెందిన ఓ బాలుడికి బోయిగూడకు చెందిన పదో తరగతి విద్యార్థినితో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారడంతో బాలిక ర్యాపిడో డెలివరీ సేవ ద్వారా తన ఇంటికి గిఫ్టులు తెప్పించుకునేది.
కొంతకాలం ఈ వ్యవహారం కొనసాగిన అనంతరం విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు ఆరా తీశారు. అనంతరం ఇరు కుటుంబాలు మలక్పేట్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఘటనపై ఫిర్యాదు చేశాయి.
మైనర్లలో సోషల్ మీడియా వినియోగం, అపరిచితులతో పరిచయాల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఘటనపై విచారణ చేపట్టి, ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సమాచారం.
















