ENGతో తొలి టీ20 నేడు.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఉత్కంఠ

ప్రతిపక్షం, జూన్ 30: భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి పోరు రేపు (జూలై 1) జరగనుంది. ఈ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం చేస్తాడా లేదా అన్నదానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

అయితే జట్టులో ఇప్పటికే అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి అనుభవజ్ఞులు ఉండటంతో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కడం సవాల్‌గా మారింది. సీనియర్ ఆటగాళ్లకే తొలి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉండటంతో అతను మరికొంతకాలం వేచి చూడాల్సి రావచ్చని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం తొలి మ్యాచ్‌లోనే వైభవ్‌కు అవకాశం ఇవ్వాలని సూచించారు. ఇటీవలి పరాజయాల నేపథ్యంలో యువ ఆటగాడిని బరిలోకి దింపితే జట్టుకు కొత్త ఉత్సాహం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Spread the love

Related News

Latest News