సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సీఎస్ సంజయ్ జాజు

ప్రతిపక్షం, జూన్ 30: తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంజయ్ జాజు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం.

ఈ భేటీలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి, సలహాదారు, ముఖ్యమంత్రి ఎక్స్-అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమితులైన కె. రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News