కేసీఆర్ అప్పులపైనే రూ.2.08 లక్షల కోట్లు చెల్లించాం: భట్టి విక్రమార్క

ప్రతిపక్షం, జూన్ 30: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంపై భారీ అప్పుల భారం పడిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, పదేళ్లలో సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు.

ఆ అప్పులకు అసలు, వడ్డీ కలిపి గత రెండున్నరేళ్లలోనే రూ.2.08 లక్షల కోట్లు చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. ఆ అప్పులు లేకపోయి ఉంటే ఆ నిధులను రైతుల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు.

పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించిన భట్టి, ఇప్పుడు కేటీఆర్, హరీశ్‌రావు వాస్తవాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

Spread the love

Related News

Latest News