ప్రతిపక్షం, జూన్ 30: రైతుభరోసా పథకం భూమికి కాదని, పంట సాగు చేసే రైతులకు ఉద్దేశించినదేనని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, భవిష్యత్తులో పంట సాగు చేసిన రైతులకే రైతుభరోసా అందజేస్తామని తెలిపారు.
గత యాసంగి సీజన్‌లో చివరి విడత రైతుభరోసా నిధులు జమ చేయలేకపోయిన విషయాన్ని అంగీకరిస్తున్నామని చెప్పారు. అయితే రైతులకు మద్దతుగా రూ.5 వేల కోట్లతో వారు పండించిన అన్ని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేశామని వివరించారు.
అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

















