కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కర్ణాటకలోని హవేరీ జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు భక్తులు టెంపోలో బెళగావిలోని ఆలయాలు దర్శించుకుని వస్తుండగా.. గుండెనహల్లి సమీపంలో పూణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని టెంపో బలంగా ఢీకొట్టడంతో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మృతులు షిమోగా జిల్లా భద్రవతి తాలూకాలోని ఎమ్మినిహట్టి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

Spread the love

Related News