ప్రతిపక్షం, జూలై 01: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ఈ ఏడాది సుమారు 20 శాతం వర్షపాతం లోటు నమోదైన నేపథ్యంలో వ్యవసాయ రంగంపై ప్రధానంగా చర్చించనున్నారు.
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛందంగా పంటల మార్పిడి చేపట్టే రైతులకు ప్రోత్సాహకాలు అందించే అంశంపై కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. పత్తి, పెసర పంటలకు ఎకరానికి రూ.8 వేల చొప్పున, జొన్నకు రూ.5 వేలు, మొక్కజొన్న, కందికి రూ.4 వేల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వడంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
అదనంగా రైతులకు పంటల బీమా అమలు, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే చర్యలు, వ్యవసాయ రంగానికి అవసరమైన సహాయ చర్యలపై కూడా మంత్రివర్గం సమీక్షించనుంది. ఈ అంశాలపై కేబినెట్ సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
















