ప్రతిపక్షం, జూలై 01: కర్ణాటకలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటరు జాబితా సవరణలతో పాటు రేషన్ కార్డు లబ్ధిదారుల పరిశీలన కూడా జరిగే అవకాశం ఉందని తెలిపారు.
ఓటు హక్కు కోల్పోతే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఓటు వేయడం ప్రతి పౌరుడి ప్రాథమిక, రాజ్యాంగబద్ధమైన హక్కు అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను సరిచూసుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
















