బీదర్ చెత్త వివాదం ముదిరింది.. రోడ్డుపై చెత్త పారబోసి రాకపోకలు స్తంభింపు

ప్రతిపక్షం, జూలై 01: తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో బీదర్ చెత్త డంపింగ్ వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. కర్ణాటకలోని బీదర్ మున్సిపాలిటీ నుంచి తరలిస్తున్న చెత్తను తెలంగాణ సరిహద్దులోని మల్గి గ్రామస్తులు గత 15 రోజులుగా అడ్డుకుంటున్నారు.

తమ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు వల్ల గాలి, నీటి కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యకు పరిష్కారం చూపలేదని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో బీదర్ మున్సిపల్ అధికారులు మల్గి–బీదర్ ప్రధాన రహదారిపై సుమారు 40 వాహనాల చెత్తను పారబోసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘటనతో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Spread the love

Related News

Latest News