ప్రతిపక్షం, జూలై 02: ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో జరగనున్న తన కుమార్తె వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఇద్దరి మధ్య కొద్దిసేపు ఆత్మీయంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం వివాహ ఆహ్వానానికి సంబంధించి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.

















