ప్రతిపక్షం, జూలై 02: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ నేడు రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు ప్రైవేట్ డిగ్రీ కాలేజీ అసోసియేషన్‌తో పాటు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించడంతో అనేక ప్రైవేట్ కళాశాలలు మూతపడే అవకాశం ఉంది.
విద్యాసంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రీయింబర్స్‌మెంట్ బకాయిలు భారీగా పేరుకుపోయాయని, దీంతో కళాశాలల నిర్వహణ తీవ్ర ఇబ్బందుల్లో పడిందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థులు, విద్యాసంస్థలకు ఉపశమనం కల్పించాలని బీసీ జేఏసీ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

















