కాంగ్రెస్ Vs బీఆర్ఎస్.. సవాళ్ల రాజకీయం

ప్రతిపక్షం, జూలై 02: తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాష్ట్ర అప్పుల అంశంపై రాజకీయ పోరు ముదురుతోంది. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల భారంలో ముంచారని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేసిన అప్పులపై బహిరంగ చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ సవాల్ విసిరింది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో అధికారిక లెక్కలతో చర్చకు వస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా తెలంగాణ భవన్‌కు చేరుకుని తమ వాదనను ఆధారాలతో వినిపించనున్నట్లు తెలిపారు.

మంత్రి జూపల్లి తెలంగాణ భవన్‌కు వస్తారా? ఇరు పక్షాల మధ్య బహిరంగ చర్చ జరుగుతుందా? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర అప్పులపై ఈ లెక్కల పోరు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Spread the love

Related News

Latest News