ప్రతిపక్షం, జూలై 02: హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి గంగారం ప్రాంతానికి చెందిన ఓ రాజకీయ పార్టీ సీనియర్ నేతపై లైంగికదాడి, బ్లాక్‌మెయిల్ ఆరోపణలతో చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, 2019లో భర్తను కోల్పోయిన ఓ మహిళతో నిందితుడికి 2024లో పరిచయం ఏర్పడి, అది స్నేహంగా మారింది. ఈ క్రమంలో మత్తుమందు ఇచ్చి ఆమె స్పృహ కోల్పోయిన సమయంలో లైంగికదాడికి పాల్పడి, ఘటనను తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆ వీడియోలను చూపిస్తూ మహిళను బెదిరించి పలుమార్లు బ్లాక్‌మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

















