ప్రతిపక్షం, జూలై 02: ఉప్పల్ భూపోరాటం సందర్భంగా అరెస్టై బొల్లారం పోలీస్ స్టేషన్లో ఉన్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉప్పల్‌లో మహిళలు, తెలంగాణ ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసి రక్తపాతం సృష్టించారని ఆమె ఆరోపించారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం వెంటనే కేటాయించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుండా ఉద్యమకారులపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
ప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్న కవిత, ఇవాళ్టి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని వ్యాఖ్యానించారు.

















