ప్రతిపక్షం, జూలై 02: తెలంగాణ గురుకులాల టెండర్ల అంశంపై చర్చించేందుకు మాజీ మంత్రుల కోసం గన్‌పార్క్ వద్ద రెండు గంటల పాటు వేచి చూశామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. అయితే బీఆర్ఎస్ నేతలు చర్చకు రాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోతున్నామని ఆయన వెల్లడించారు.
ఈ అంశంపై నిజమైన చర్చ జరగాలంటే అసెంబ్లీ వేదికగా రావాలని, అక్కడే అన్ని విషయాలను ఆధారాలతో వివరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
మరోవైపు మాజీ మంత్రి హరీశ్‌రావును గన్‌పార్క్‌కు రాకుండా ప్రభుత్వమే అరెస్ట్ చేయించిందనే ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వ విప్ వీరేశం, ఆ పరిస్థితికి బీఆర్ఎస్ నేతలే కారణమని వ్యాఖ్యానించారు. దీంతో గురుకులాల టెండర్ల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

















