ప్రతిపక్షం, జూలై 02: రాష్ట్ర అప్పుల అంశంపై బహిరంగ చర్చకు గన్‌పార్క్‌కు చేరుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను మాటకు కట్టుబడి అధికారిక లెక్కలు, ఆధారాలతో చర్చకు వచ్చానని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం చేసిన అప్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్న జూపల్లి, ఆ లెక్కలు తప్పని బీఆర్ఎస్ భావిస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే ఆ విషయం చెప్పించాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
చర్చకు సవాల్ విసిరిన బీఆర్ఎస్ నేతలు చివరకు వెనక్కి తగ్గారని, ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలను చెప్పేందుకు సిద్ధంగా లేరని మంత్రి విమర్శించారు. రాష్ట్ర అప్పుల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతుండటంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

















