రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో మెదక్ జిల్లాకు 8వ స్థానం: కలెక్టర్ ప్రతిమా సింగ్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 02: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో మెదక్ జిల్లా 8వ స్థానంలో నిలిచిందని మెదక్ జిల్లాకలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,01,752 మంది రైతుల నుంచి 4.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ. 1,005 కోట్లు జమ చేశామని, మరో రూ.10 కోట్లు నేడు చెల్లించనున్నట్లు వెల్లడించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందన్నారు.మీడియా సమావేశంలో, అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా పౌరసరఫరాల అధికారులు నిత్యానంద్,, జగదీష్, డిఆర్డిఓ శ్రీనివాసరావు. తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News