రైతు భరోసా మూడో విడత విడుదల.. 6.39 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,330 కోట్లు జమ

ప్రతిపక్షం, జూలై 02: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద మూడో విడత నిధులను విడుదల చేసింది. 3 నుంచి 4 ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.1,330 కోట్లను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

ఈ విడత ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 6.39 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారని మంత్రి వెల్లడించారు. రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విడతల వారీగా నిధులను విడుదల చేస్తోందని పేర్కొన్నారు.

ఇప్పటివరకు రైతు భరోసా పథకం కింద మొత్తం 61.35 లక్షల మంది రైతులకు రూ.5,402 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించినట్లు మంత్రి తుమ్మల వివరించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

Spread the love

Related News

Latest News