ఇందిరమ్మ ఇళ్లకు వేగం.. త్వరలో లక్ష ఇళ్ల నిర్మాణానికి టెండర్లు

ప్రతిపక్షం, జూలై 02: హైదరాబాద్ క్యూర్ (CORE Urban Region) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు ఆహ్వానించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

మూడు కార్పొరేషన్ల పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ మరో రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. భూసేకరణ పూర్తయ్యాక నిర్మాణ ప్రక్రియను వేగంగా ప్రారంభిస్తామని చెప్పారు.

క్యూర్ పరిధిలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా మొదటి దశలో ఒక్కో నియోజకవర్గంలో 500 నుంచి 1,000 ఇళ్ల వరకు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం రెండో, మూడో విడతల్లో మరిన్ని ఇళ్లను మంజూరు చేసి పేదలకు గృహ వసతి కల్పిస్తామని స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News