ఉపాధ్యాయులకూ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం

ప్రతిపక్షం, జూలై 02: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి కూడా విద్యార్థులతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల కోసం ప్రారంభించిన బ్రేక్‌ఫాస్ట్ పథకానికి మంచి స్పందన రావడంతో, అదే సౌకర్యాన్ని ఉపాధ్యాయులు, సిబ్బందికీ విస్తరించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఈ అంశంపై ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ వర్గాల నుంచి ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు రావడంతో క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఇకపై విద్యార్థులతో కలిసి అల్పాహారం, మధ్యాహ్న భోజనం పొందనున్నారు.

ఈ నిర్ణయం ద్వారా పాఠశాలల్లో సమిష్టి వాతావరణం మెరుగుపడటంతో పాటు, విద్యార్థులు-ఉపాధ్యాయుల మధ్య అనుబంధం మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ప్రభుత్వ విద్యాసంస్థల్లో సంక్షేమ చర్యలను మరింత విస్తరించే దిశగా ఇది మరో కీలక అడుగుగా నిలవనుంది.

Spread the love

Related News

Latest News