అద్దె గదిలో ప్రేమజంట మృతదేహాలు.. ఆత్మహత్య కోణంలో దర్యాప్తు

ప్రతిపక్షం, జూలై 02: ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్ జిల్లాలో అద్దె గదిలో ఓ యువకుడు, యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. కేరళకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల యువతి ఒకే గదిలో విగతజీవులుగా కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా, గది లోపలి నుంచి గడియ పెట్టి ఉండటాన్ని గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఇది ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ఘటనగా భావిస్తున్నారు. యువకుడు ముందుగా తన మణికట్టు కోసుకుని, అనంతరం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. యువతి విషం సేవించి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. ఘటనకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

Spread the love

Related News

Latest News