ప్రతిపక్షం, జూలై 03: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం కేసీఆర్‌కు లేదని ఆరోపించారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని, అసెంబ్లీకి కూడా కేవలం హాజరు కోసమే వస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మధ్యకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేశారు.
తమ లక్ష్యం కేటీఆర్, హరీశ్‌రావు కాదని, వారు కేవలం సైడ్ యాక్టర్లేనని వ్యాఖ్యానించిన అద్దంకి దయాకర్, కేసీఆర్ స్వయంగా ముందుకు వచ్చి ప్రతిపక్ష బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు.

















