పాకిస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడిపోయి 40 మంది మృతి

ప్రతిపక్షం, జూలై 03: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రమాదంలో మృతులలో మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. బస్సు లోయలో పడిపోవడంతో పూర్తిగా ధ్వంసమైందని, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని అధికారులు తెలిపారు.

ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News